నేషనల్ హెరాల్డ్ కేసు.. ముగిసిన అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ.. రెండు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు..

By Sumanth KanukulaFirst Published May 31, 2023, 1:48 PM IST
Highlights

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ప్రశ్నించారు. దాదాపు రెండు గంటల పాటు అంజన్ కుమార్ యాదవ్‌ను విచారించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని యంగ్ ఇండియన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే యంగ్ ఇండియన్ ఫౌండేషన్  ఛారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి ఈడీ అధికారులు మరోసారి ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక, ఈడీ అధికారులు గతేడాది నవంబర్‌లో అంజన్ కుమార్ యాదవ్‌ను విచారించారు. ఆ సమయంలో ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం అంజన్ కుమార్ యాదవ్‌కు ఈ నెల 31న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు పంపారు. దీంతో అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. 

click me!