తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,95,232 కి చేరుకొంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,95,232 కి చేరుకొంది. గత 24 గంటల్లో 8,126 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,08,602 మందికి పరీక్షలు నిర్వహిస్తే 8,126 మందికి కరోనా సోకినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో గత 24 గంటల వ్యవధిలో 38 మంది మరణించారు.నిన్న ఒక్కరోజే 3,307 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62,929కి చేరుకొన్నాయి.
రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 83.57 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిణామం ఆందోళన కల్గిస్తోందని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు. హైద్రాబాద్‌లో 1,259, మేడ్చల్ లో 676, రంగారెడ్డిలో 591 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజెకి పెరిగిపోతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కి కూడ కరోనా సోకింది. రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులను అరికట్టేందుకు రాష్ట్రం తీసుకొన్న చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.