తెలంగాణలో 24 గంటల్లో కరోనాతో 23 మంది మృతి: కొత్తగా 5,567 కేసులు

By narsimha lodeFirst Published Apr 22, 2021, 10:00 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది.  గత 24 గంటల్లో 1,02,335 మందికి పరీక్షలు నిర్వహిస్తే  5,567 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.  రాష్ట్రంలో ఇప్పటివరకు  3.73 లక్షలకు కరోనా కేసులు చేరుకొన్నాయి. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది.  గత 24 గంటల్లో 1,02,335 మందికి పరీక్షలు నిర్వహిస్తే  5,567 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.  రాష్ట్రంలో ఇప్పటివరకు  3.73 లక్షలకు కరోనా కేసులు చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఒక్క రోజులోనే  23 మంది మరణించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య 1,899కి చేరుకొంది. ఇంకా 49,781 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖధికారులు చెబుతున్నారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 3.21 లక్షల మంది కరోనా నుండి కోలుకొన్నారు.  కరోనా నుండి నిన్న ఒక్క రోజే 2,251 మంది కోలుకొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 989 కేసులు నమోదయ్యాయి.  

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో మాస్కులు ధర్ించకపోతే రూ. 1000 జరిమానాను విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాాలు జారీ చేసింది.రాష్ం్రంలో కరోనా రోగులకు ప్రైవేట్ , ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్యను పెంచారు.ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.

click me!