తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి: కరోనాతో 1242 మంది మృతి

Published : Oct 14, 2020, 11:05 AM IST
తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి: కరోనాతో 1242 మంది మృతి

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా కేసులను అరికట్టేందుకు గాను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా కేసులను అరికట్టేందుకు గాను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

తెలంగాణలో రాష్ట్రంలో మంగళవారం నాడు రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,446 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,16,238కి చేరాయి.

తాజాగా 1,918 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో 23, 728 యాక్టివ్ కేసులున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 19,413 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టుగా  వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1241 మంది మరణించారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోగులకు వైద్య సేవలు అందించడం లేదని రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెెలిసిందే. గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే