మరో 24 గంటలు భారీ వర్షాలు: ఏపీ, తెలంగాణలో హై అలెర్ట్

By narsimha lodeFirst Published Oct 14, 2020, 10:47 AM IST
Highlights

రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.కాకినాడ వద్ద వాయుగుండం తీరం దాటింది.దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఇద్దరు, ఏపీలో ఆరుగురు చనిపోయారు.


హైదరాబాద్: రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.కాకినాడ వద్ద వాయుగుండం తీరం దాటింది.దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఇద్దరు, ఏపీలో ఆరుగురు చనిపోయారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ  అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు, నీళ్లు నిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.

రిజర్వాయర్లు,  చెరువులు ,కుంటలు పొంగిపొర్లుతున్నాయి. తక్కువ వంతెనలు, కాజ్‌వేలపై నుండి వరద నీరు ప్రవాహిస్తోంది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ కు  అంతరాయం ఏర్పడింది.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  ఆదేశించారు.

లో లెవల్ వంతెనలు, కాజ్ వేల  వద్ద ప్రత్యేక శ్రద్ద అవసరమని అధికారులు కోరారు. ప్రాణ నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. 

పాదచారులు ట్రాఫిక్ కదలికలను కచ్చితంగా నిషేధించాలని కోరారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు, తెలంగాణలో ముగ్గురు చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం అయిందని ఏపీకి చెందిన అధికారులు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11.5 సెం.మీ. నుండి 24 సెం,.మీ. వర్షపాతం నమోదైంది. సుమారు 100 ప్రాంతాల్లో   సుమారు 24 సెం.మీ వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా జిల్లాల్లో 
భారీగా వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల కారణంగా రోడ్లు కన్పించడం లేదు.  వేలాది ఎకరాల వ్యవసాయ భూములు కూడ వరదలకు గురయ్యాయి.తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వరదలతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది.  రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందినట్టుగా  తెలిపారు. 

భారీ వర్షాలతో శిథిలావస్తలో ఉన్న 150 ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు.
 

click me!