తెలంగాణలో తగ్గిన కరోనా ఉధృతి: కొత్తగా 582 కేసులు, నలుగురు మృతి

Published : Oct 26, 2020, 08:58 AM IST
తెలంగాణలో తగ్గిన కరోనా ఉధృతి: కొత్తగా 582 కేసులు, నలుగురు మృతి

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొత్తగా తెలంగాణలో 582 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో గణనీయంగా పాజిటివ్ కేసులు తగ్గాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 582 కోవిడ్ పాడిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2 లక్షల 11 వేల 192కు చేరుకుంది. 

కొత్తగా తెలంగాణలో కరోణా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1311కు చేరుకుంది. తెలంగాణలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 2.31 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు. 18611 యాక్టివ్ కేసులున్నాయి.

హైదరాబాదు సమీపంలోని రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో గణనీయంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో 55 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మేడ్చెల్ లో 38 కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 174 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి...

ఆదిలాబాద్ 9
భద్రాద్రి కొత్తగూడెం 22
జిహెచ్ఎంసీ 174
జగిత్యాల 14
జనగామ 2
జయశంకర్ భూపాలపల్లి 0
జోగులాంబ గద్వాల 4
కామారెడ్డి 0
కరీంనగర్ 15
ఖమ్మం 17
కొమరభీమ్ ఆసిఫాబాద్ 0
మహబూబ్ నగర్ 15
మహబూబాబాద్ 13
మంచిర్యాల 2
మెదక్ 4
మేడ్చెల్ మల్కాజిగిరి 38
ములుగు 0
నాగర్ కర్నూలు 6
నల్లగొండ 87
నారాయణపేట 0
నిర్మల్ 0
నిజామాబాద్ 24
పెద్దపల్లి 0
రాజన్న సిరిసిల్ల 4
రంగారెడ్డి 55
సంగారెడ్డి 31
సిద్ధిపేట 15
సూర్యాపేట 4
వికారాబాద్ 4
వనపర్తి 1
వరంగల్ రూరల్ 7
వరంగల్ అర్బన్ 13
యాదాద్రి భువనగిరి 2

 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం