పండుగ రోజున విషాదం: ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య

Published : Oct 25, 2020, 02:05 PM ISTUpdated : Oct 25, 2020, 02:06 PM IST
పండుగ రోజున విషాదం: ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య

సారాంశం

ప్రేమించిన అమ్మాయి మృతిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకొన్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో  ఆదివారం నాడు చోటు చేసుకొంది.


మహదేవపూర్: ప్రేమించిన అమ్మాయి మృతిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకొన్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో  ఆదివారం నాడు చోటు చేసుకొంది.

మహదేవపూర్ గ్రామానికి చెందిన చల్లా మహేష్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. మహేష్ వయస్సు 24 ఏళ్లు.మహేష్ అతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.తాను ప్రేమించిన యువతి అనారోగ్యంతో మరణించడంతో  మనోవేదనకు గురయ్యాడు.

also read:బాలికను వ్యభిచార గృహానికి అమ్మిన వదిన: బ్యాంకు లావాదేవీలతో విటుల గుర్తింపు

రోజువారీ విధుల్లో భాగంగా ఇంటి నుండి బయటకు వెళ్లిన మహేష్ యువతి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తన ప్రియురాలు లేని లోకంలో తాను ఉండలేనని ఆయన  ఆత్మహత్య చేసుకొనే ముందు ఆయన వాట్సప్ స్టేటస్ పెట్టుకొన్నాడని స్నేహితులు చెప్పారు.

పండుగ రోజున మహేష్ ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు