జగన్‌కు లేని ఇబ్బంది మీకెందుకు: కేసీఆర్‌పై బండి సంజయ్

Published : Sep 17, 2020, 04:43 PM IST
జగన్‌కు లేని ఇబ్బంది మీకెందుకు: కేసీఆర్‌పై బండి సంజయ్

సారాంశం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విద్యుత్ సవరణ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విద్యుత్ సవరణ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత కొత్త విద్యుత్ చట్టంపై ఉద్యోగులను రెచ్చట్టేందుకు సీఎం ప్రయత్నించారన్నారు.
ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ కు లేని ఇబ్బంది తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏముందని ఆయన ప్రశ్నించారు.

ఈ చట్టంపై అవగాహన లేకపోతే జగన్ ను భోజనానికి పిలిచి తెలుసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టకముందే అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ ఎలా తీర్మానం చేశారని ఆయన ప్రశ్నించారు.

కొత్త చట్టంతో ఉద్యోగాలు పోతాయని అనవసర భయాలను సృష్టిస్తున్నారని ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు.రైతులకు ఉచిత విద్యుత్ పేరిట భారీ దోపీడీ జరుగుతోందన్నారు. కొత్త చట్టం వస్తే ఈ దోపీడీకి అడ్డుకట్ట పడుతోందనే భావనతోనే కేసీఆర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్‌సీ ఏర్పాటు చేయకముందు జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరిపిస్తామన్నారు. పాతబస్తీలో విద్యుత్తు చౌర్యం, బకాయిలపై సీఎం ఎందుకు

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!