పోలీసుల చేతిలో పడ్డ మావోయిస్టు పాతనోట్లు

First Published Dec 1, 2016, 12:31 PM IST
Highlights

మావోయిస్టుల పాత నోట్ల మార్పిడిని వమ్ము చేసిన మహబూబ్ నగర్  జిల్లా  పోలీసులు

పాత అయిదొందలు, వేయి నోట్లను మార్చేందుకు మావోయిస్టు పార్టీ చేసిన ప్రయత్నాలను మహబూబ్ నగర్ పోలీసులు వమ్ము చేశారు.

 

నోట్ల రద్దు తర్వాత  మావోయిస్టులు తమ దగ్గిర ఉన్నఅయిదొందల, వేయి నోట్లను సానుభూతి పరుల ద్వారా,  ఇతర అనుబంధ సంస్థల నాయకుల ద్వారా లేదా అమాయక గ్రామస్తుల ద్వారా మార్చేందుకు ప్రయత్నం చేస్తారని డిజిపి జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు.

 

దీనితో జిల్లా మొత్తంగా మావోయిస్టుల వత్తిడికిలోనయ్యే అవకాశం ఉన్న వారందరిమీద నిఘావేయాలని మహబూబ్ నగర్ ఎస్ పి రెమారాజేశ్వరి పోలీసు పోలీసు అధికారులను పురమాయించారు.

ఈ వ్యూహం ఫలించింది. గురువారం మధ్యాహ్నం మావోయిస్టులు  మార్చాలనుకున్న12  లక్షల రుపాయలు పోలీసుల చేతిలో పడ్డాయి.

 

మావోయిస్టుల ప్రయత్నం గురించి ఈ రోజు మధ్యాహ్నం మఖ్తల్ సబ్ ఇన్స్ పెక్టర్ కు సమాచారం అందింది.

 

మండలంలోని మంథనగోడు పోస్టాఫీసు ఉద్యోగి సహాయంతో మావోయిస్టులు పాత కరెన్సీనోట్లను మార్చుకునేందుకు ప్రయత్నం చూస్తున్నారనే సమాచారం అందగానే, పోలీసుల ఆ గ్రామం చేరుకుని  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సత్యానారాయణాచారి ఇంటిని చుట్టు ముట్టారు.

 

పోస్టుమాస్టర్ ఇంటిలో ఉన్న  ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల నుంచి అనేక అయిదొందల, వేయి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. త్రినాధ రావు, సిద్ధార్థ అనే ఈ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

మహబూబ్ నగర్ జిల్లా ఎస్ పి రెమారాజేశ్వరి కధనం ప్రకారం గజ ఇంజనీరింగ్ డిప్యూటి ప్రాజక్టు మేనేజర్  చింతా త్రినాథరావు నుంచి మావోయిస్టులు పెద్ద మొత్తంలో డబ్బువసూలు చేశారు. ఈ డబ్బు అందించేందుకు ఛత్తీష్ గడ్ లోని నక్సలైట్ స్థావరానికి త్రినాథరావు వెళ్లాడు. అపుడు, ఏదో విధంగా తమ దగ్గిర ఉన్న రు. 12 లక్షల పాతనోట్లను మార్పించాలని మావోయిస్టులు ఆయనను కోరారు.

 

దీనికి కొంత కమిషన్ కూడా ఇస్తామని ఆశచూపారు. దీనికోసం త్రినాథ రావు తన స్నేహితుడు సిద్ధార్థ సహాయం తీసుకున్నాడు. తనకు పరిచయమున్నమంధన్ గోడ్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సత్య నారాయణాచారి ద్వారా పాత నోట్ల ను మార్పించవచ్చని సిద్ధార్థ సలహా ఇచ్చాడు.

 

ఇలా వారు సత్యనారాయణాచారిని  అశ్రయించారు. ఈ డబ్బును  మార్చేందుకు చారి మొదట 30 శాతం కమిషన్ డిమాండ్ చేసినా తర్వాత బేరమాడి 15 శాతం దగ్గిర వప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత నోట్లు మార్చుకునేందుకు వీరిద్దరిని నవంబర్ 30న పోస్టాఫీసుకు రమ్మని చారి చెప్పాడు. అయితే, ఈ సమాచారం ముందే తెలుసుకున్న పోలీసులు మార్పిడి ప్రయత్నం సాగకుండా అడ్డుకున్నారు. వీరందరిమీద తెలంగాణా పబ్లిక్ సెక్యూరిటీ చట్టం కింద మఖ్తల్ పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్ పి రెమా రాజేశ్వరి చెప్పారు.

 

 

click me!