కరోనా వ్యాక్సిన్ తీసుకొంటేనే పబ్లిక్ ప్లేసుల్లోకి అనుమతి: తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు

By narsimha lodeFirst Published Aug 18, 2021, 5:07 PM IST
Highlights


కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తోంది. 18 ఏళ్లు దాటినవారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరింది. వ్యాక్సిన్ వేసుకోకపోతే పబ్లిక్ ప్లేసుల్లో తిరిగేందుకు అనుమతిని నిరాకరించే యోచనలో ప్రభుత్వం ఉందని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.


హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకొంటేనే  పబ్లిక్ ప్లేసుల్లో తిరగడానికి అనుమతివ్వడంపై ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

బుధవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన కోరారు.రాబోయే రోజుల్లో ఇంటింటికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యా సంస్థలు తెరిచేందుకు నివేదికఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీచర్లందరికీ వ్యాక్సిన్  ఇచ్చామని ఆయన తెలిపారు. 

also read:తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసింది..: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటన

రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదౌతున్నాయి.  సెకండ్ వేవ్ ముగిసిందని ఆయన చెప్పారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 1.65 మందికి కరోనా వ్యాక్సిన్ అందించామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది అర్హులున్నారని వైద్య ఆరోగ్యశాఖాధికారులు గుర్తించారు. వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని డీహెచ్ కోరారు. 

click me!