ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాకిచ్చిన తెలంగాణ పీసీసీ.. ఆయనకు అప్పగించిన బాధ్యతల నుంచి తొలగింపు..

Published : Mar 21, 2022, 04:55 PM IST
ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాకిచ్చిన తెలంగాణ పీసీసీ.. ఆయనకు అప్పగించిన బాధ్యతల నుంచి తొలగింపు..

సారాంశం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాఫిక్‌గా మారిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆయనకు అప్పగించిన బాధ్యతల నుంచి తొలగిస్తూ పీసీపీ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాఫిక్‌గా మారిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని (Jagga Reddy) ఆయనకు అప్పగించిన బాధ్యతల నుంచి తొలగిస్తూ పీసీపీ నిర్ణయం తీసుకుంది. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించినట్టుగా పీపీపీ సోమవారం ప్రకటన చేసింది. ఎంపీ నియోజకవర్గాల బాధ్యతల నుంచి కూడా జగ్గారెడ్డిని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా ఆయనన తప్పించింది. ప్రస్తుతం జగ్గారెడ్డి వద్ద ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. 
  
ఇక, జగ్గారెడ్డి తెలంగాణలోని రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తూనే సంగతి తెలిసిందే. తనకు అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీల మాటే శాసనమని.. వాళ్లకు మించి ఎవరి మాట వినేది లేదని గట్టిగానే చెబుతూ వస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆయన రాజీనామాకు సిద్దం కావడం కూడా తీవ్ర కలకలం రేపింది. అయితే సీనియర్ల బుజ్జగింపుతో ఆయన కాస్తా వెనక్కి తగ్గారు. 

అయితే ఆదివారం మరోసారి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా పలువురు సీనియర్‌ నేతలతో జగ్గారెడ్డి భేటీ కావడం.. కాంగ్రెస్‌లో తీవ్ర కలకలమే రేపింది. ఈ సమావేశం అనంతరం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే తనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని పోటీ పెట్టి గెలిపించాలని Jagga Reddy టీపీసీసీ చీఫ్ Revanth Reddy కి సవాల్ విసిరారు.

ఆదివారం జరిగిన సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. తమని సస్పెండ్ చేయడానికి మీరెవరూ అంటూ  తెలంగాణ పీసీపీపై జగ్గారెడ్డి ఫైరయ్యారు. మంత్రి హరీష్ రావును తన కూతురు కోసం వి. హనుమంతరావు కలిశాడని జగ్గారెడ్డి చెప్పారు.  ఇందులో తప్పేం ఉందన్నారు హనుమంతరావు కూతురు డాక్టర్ అని, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును వి. హనుమంతరావు కలవడాన్ని కూడా తప్పు బడితే ఎలా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వాళ్లు కలవలేదా, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  కాంగ్రెస్ వాళ్లు మంత్రులను కలవలేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

తమ లాంటి నేతలు లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పార్టీలో అందరినీ కలుపుకు పోవాలని జగ్గారెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి భజనపరులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఒక్కడే  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాడా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఒక్కడే గొప్ప నాయకుడే అయితే సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపి గెలిపించాలని ఆయన సవాల్ చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపిస్తే అతను కాంగ్రెస్ లో గొప్ప నాయకుడని జగ్గారెడ్డి చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహరం కాదన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత షో చేస్తున్నాడన్నారు. తాను కూడా వ్యక్తిగత షో చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. 

ఫోకాజ్ ఇస్తే ఏమైతదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనకు దమ్ముంటే షోకాజ్ ఇవ్వనివ్వాలని కోరారు. తనకు షోకాజ్ నోటీసు ఇస్తే  రేవంత్ రెడ్డి గురించి ప్రతి రోజూ మాట్లాడుతానని జగ్గారెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేస్తూ టీపీసీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

  

PREV
click me!

Recommended Stories

Union Minister Rammohan Naidu Inaugurates ‘Wings India 2026’ in Hyderabad | Asianet News Telugu
Civil Aviation Minister Rammohan Naidu Speech at Wings India 2026 Hyderabad | Asianet News Telugu