భార్య వివాహేతర సంబంధం.. అవమానంతో భర్త ఆత్మహత్య...

By SumaBala Bukka  |  First Published Mar 21, 2022, 2:12 PM IST

రెండో భార్య... సంతానం లేదు.. దీనికి తోడు ఆ భార్య వివాహేతర సంబంధం.. ఇవన్నీ కలిసి అతడిని మనస్తాపానికి గురి చేశాయి. వద్దని వారించినా వినకుండా అడ్డంగా దొరికిపోయిన భార్యను చూసి అవమానం తట్టుకోలేకపోయాడు.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 


కరీంనగర్ : ఓ వివాహిత మరొకరితో extramarital affair పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. wife చేసిన మోసం అతడిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో వివాహిత lover, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఇక బతకొద్దని నిర్ణయించుకుని తనువు చాలించాడు. మృతుడి  కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన  జెరిపోతుల హనుమాండ్లు- దేవమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరి చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి దేవమ్మే  పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు గంగాధర్ (35)కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో పెళ్ళి జరిపించింది. వీరికి  ప్రమోద్ అనే కొడుకు ఉన్నాడు.

కాగా, తిరుపతమ్మ పెళ్ళయిన రెండేళ్ళకే health issuesతో మృతి చెందింది. తరువాత గంగాధర్ పెగడపల్లి మండలం సంచర్లకు చెందిన మమతను second marriage చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ పెళ్లి జరిగి ఆరేళ్ల అయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మమత జెరిపోతుల అభిషేక్ అనే  ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినా మమతా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అభిషేక్ తో పాటు అతని కుటుంబసభ్యులను మందలించాడు.

Latest Videos

undefined

ఈనెల 11న మమత తన ప్రియుడితో కలిసి గంగాధర్ కు పట్టుబడింది.  దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గత శనివారం రాత్రి  అభిషేక్, అతని కుటుంబ సభ్యులు గంగాధర్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి, తల్లి దేవమ్మ బోరున విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు మందలించినా కోడలు వినలేదని తెలిపింది. ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యులు తమను చంపేస్తామని బెదిరించారని, అందువల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు మమత అభిషేక్ లపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే  దేవమ్మ తన కుమారుడి మృతి అభిషేక్ తల్లి లక్ష్మీ, తండ్రి కృష్ణయ్య, జెరిపోతుల రాకేష్, మహేష్, శంకర్, అతని భార్య, అమ్మాయిలు కూడా కారణమని చెప్పిందన్నారు. విచారణలో నిజమని తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. డిఎస్పి ప్రకాష్ బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్, డిసీసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్  పరామర్శించారు. 

ఊర్లో మంచి పేరున్న గంగాధర్ చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. రెండో భార్య చేసిన పనిని అందరూ విమర్శిస్తున్నారు. చక్కటి కాపురాన్ని క్షణిక సుఖం కోసం బలితీసుకుందని, ఇప్పుడు ఈ నేరానికి జీవితకాలం శిక్ష అనుభవింస్తుందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. గంగాధర్ తల్లి రోదనలు అందరి హృదయాల్ని కదిలిస్తున్నాయి. ముందే తల్లిని కోల్పోయి.. ఇప్పుడు తండ్రినీ కోల్పోయిన గంగాధర్ మొదటి భార్య కొడుకు అనాథగా మారాడు. 

click me!