Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

Published : Dec 17, 2025, 08:49 AM IST
Telangana Panchayat Elections 2025

సారాంశం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది… ఇవాళ చివరి విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలింగ్ మొదలయ్యింది. ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. 

Telangana Panchayat Elections 2025 : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమీషన్ సిద్దమై ఇప్పటికే రెండు విడతలు పూర్తిచేసింది. ఇవాళ (డిసెంబర్ 17, బుధవారం) మూడో విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పోలింగ్ మొదలయ్యింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు పూర్తయినట్లే... అన్ని గ్రామాల్లో పాలకవర్గాలు కొలువుదీరినట్లే.

నేడే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

మూడో విడతలో మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలుండగా 12,652 మంది పోటీ పడుతున్నారు. ఇక 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మొత్తం స్థానాలకు ఉదయమే పోలింగ్ ప్రారంభమయ్యింది... ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు, పూర్తవగానే పలితాల వెల్లడి ఉంటుంది.

ఈ పంచాయతీలకు నో ఎలక్షన్స్

మూడో విడతలో 394 పంచాయతీల్లో ఎన్నికలు లేకుండానే పాలకవర్గాలు ఎన్నికయ్యాయి... ఈ గ్రామాల ప్రజలు సమన్వయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఈ పంచాయతీల్లో ఇవాళ ఎన్నికలు జరగడంలేదు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. ఆమ్రాబాద్ మండలంలో నల్లమల షెడ్యూల్ ప్రాంతంల్లో ఎస్టీలు లేని గ్రామాల్లో వారికి రిజర్వేషన్లు కేటాయించడంతో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !