తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్

sivanagaprasad kodati |  
Published : Jan 21, 2019, 08:20 AM IST
తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్

సారాంశం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4479 పంచాయతీలకు గాను ఈ విడతలో 769 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4479 పంచాయతీలకు గాను ఈ విడతలో 769 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 70, 094 మంది అభ్యర్థులు ఉన్నారు.

తొలి విడత ఎన్నికల్లో 10, 654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. సుమారు 26 వేలమంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.

 మధ్యాహ్నాం 2 తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రానిక ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, తొలి విడతలో 769 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం పోలింగ్ సరళిని పర్యవేక్షించనుంది.

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!