ఔదార్యం: బాలుడి కోరిక తీర్చిన ఈటెల రాజేందర్

By pratap reddyFirst Published 20, Jan 2019, 8:30 PM IST
Highlights

జన్యువాధితో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడి కోరికను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీర్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలవాలని ఆ బాలుడి కోరికను ఆయన గతంలో తీర్చారు. 

హైదరాబాద్: జన్యువాధితో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడి కోరికను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీర్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలవాలని ఆ బాలుడి కోరికను ఆయన గతంలో తీర్చారు. 

జన్యుపమైన వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడు విఘ్నేష్ ను హైదరాబాద్ పిలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిపించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ ద్వారా బాలుడికి 5 లక్షల ఆర్థిక సహాయం చేయించారు.

ఎన్నికలకు ముందు కృతఙ్ఞత తో విఘ్నేష్ కుటుంబ సభ్యులు సామాజికవేత్త చిలువేరు ఆధ్వర్యంలో హుజురాబాద్ కి వెళ్లి సంఘీభావాన్ని ప్రకటించారు. 

చిలువేరు శంకర్ అభ్యర్థన మేరకు ఆదివారం ఈటెల రాజేందర్ వరంగల్ లో ఉన్న విఘ్నేష్ ని పరామర్శించారు.

Last Updated 20, Jan 2019, 8:30 PM IST