ముగిసిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు, 5 గంటలకు కౌంటింగ్

By Siva KodatiFirst Published Feb 9, 2020, 4:04 PM IST
Highlights

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 84 ఓట్లకు గాను 81 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనగా.. ఇద్దరు సభ్యులు ఓటు వేయలేదు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, వెంటనే ఫలితాలను వెలువరించనున్నారు. 

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 84 ఓట్లకు గాను 81 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనగా.. ఇద్దరు సభ్యులు ఓటు వేయలేదు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, వెంటనే ఫలితాలను వెలువరించనున్నారు.

Also Read:తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు: కోర్టుకెళ్లనున్న జయేశ్ ప్యానెల్

అంతకుముందు పోలింగ్ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఖమ్మం జిల్లా ఒలింపిక్ కార్యదర్శి మహీధర్ ఓటును మరో వ్యక్తి వినియోగించుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. తన ఓటును మరో వ్యక్తి ఎలా వేస్తారని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లిస్టులో తన పేరు లేదని.. ఇలా జరగడానికి సంఘం జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ కుట్ర ఉందని మహీధర్ ఆరోపిస్తున్నారు. 

టీఎస్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తెలంగాణ సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్, బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రొఫెసర్ రంగారావు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషన్లు వేయగా.. జయేశ్, జితేందర్ నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.

Also Read:తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ట్విస్ట్: ఆ ఇద్దరి నామినేషన్లు రిజెక్ట్

జయేష్ రంజన్ నామినేషన్‌ను తిరస్కరించటం అనైతికమని, నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను రిటర్నింగ్ అధికారి ఇప్పటికీ చెప్పటం లేదని, అసలు రిటర్నింగ్ అధికారిగా చంద్రకుమార్‌ను ఎవరు నియమించారో చెప్పాలని తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు అన్నారు. రిటర్నింగ్ అధికారిగా జస్టిస్ చంద్రకుమార్ నియామకంపై తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

click me!