Telangana Ministers list : మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి .. ఎవరికి ఏ శాఖ అంటే..?

By Siva Kodati  |  First Published Dec 7, 2023, 4:40 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. వారి అందరినీ తీసుకుని నేరుగా సచివాలయానికి బయల్దేరిన రేవంత్ .. తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. 


తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క.. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే వీరిలో ఎవరికి ఏ శాఖ కేటాయించారోనని రాష్ట్ర ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వీరిలో కొందరు కొత్తవారైతే అత్యధిక మందికి ఇప్పటికే మంత్రులుగా చేసిన అనుభవం వుంది. కాసేపటి క్రితమే మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి.

మంత్రులు - శాఖలు :

Latest Videos

భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ 
ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోంమంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
డీ. శ్రీధర్ బాబు - ఆర్ధిక మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  - నీటిపారుదల శాఖ మంత్రి
కొండా సురేఖ - మహిళా సంక్షేమ శాఖ
దామోదర రాజనర్సింహ - ఆరోగ్య శాఖ
జూపల్లి కృష్ణారావు - పౌర సరఫరాల శాఖ
సీతక్క - గిరిజన సంక్షేమం
తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు , భవనాల శాఖ
పొన్నం ప్రభాకర్ - బీసీ సంక్షేమం 
 

click me!