తెలంగాణ నూతన సీఎస్ గా ఎస్ కె జోషి

First Published Jan 31, 2018, 5:02 PM IST
Highlights
  • నూతన సీఎస్ గా ఎస్ కే జోషి నియామకం
  • ముగిసిన ప్రస్తుత సీఎస్ ఎస్పి సింగ్ పదవీకాలం

 తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా శైలేంద్రకుమార్ జోషిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం ముగియడంతో ఆయన్ని మళ్లీ కొనసాగించాలని సర్కార్ భావించింది. అయితే సర్వీస్ పొడిగింపుకు కేంద్రం అనుమతించకపోవడంతో నూతన సీఎస్ ను నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సీనియర్ అధికారి అయిన శైలేంద్రకుమార్ జోషిని సీఎస్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

అయితే జోషి విద్యాభ్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బైటకువచ్చాయి. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని స్వరాష్ట్రం బరేలిలోనే చదువుకున్న ఆయన, 6 నుంచి 8 తరగతుల వరకు తృతీయ భాషగా తెలుగును అభ్యసించారు.  ఆ తర్వాత ఐఐటీ రూర్కీలో 1977-1981 మధ్య కాలంలో ఇంజినీరింగ్(ఈసీఈ) చదివారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీజీ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ వైపు అడుగేసి  1984 లో సెలక్టయ్యాడు. ఆ తర్వా కూడా చదువు పైన ఉన్న మక్కువతో   2010లో పీహెచ్‌డీ పట్టా పొందారు.  

శైలేంద్ర కుమార్ నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా సేవలందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ శాఖల్లో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పని చేశారు.    ప్రస్తుతం ఈయన నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. 

click me!