మునిసిపల్ ఎన్నికలకూ పాకిన క్యాంపు రాజకీయాలు... నో లోకల్ క్యాంప్స్ ఓన్లీ గోవా

By telugu teamFirst Published Jan 25, 2020, 9:35 AM IST
Highlights

ఇంకా ఫలితాలు కూడా వెలువడక ముందే మేయర్, చైర్మన్ పీఠాలపై కన్నేసిన అభ్యర్థులు తమ వర్గీయులను క్యాంపులకు తరలించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. వీరికి వారి వారి పార్టీలు కూడా సహకారాన్ని అందిస్తున్నాయి. 
 

 తెలంగాణలో మొన్న ముగిసిన మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమయింది. కౌంటింగ్ కేంద్రాలవద్ద హడావుడి ఇప్పటికే మొదలయింది. పోలీసులు అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసారు. 

ఇంకా ఫలితాలు కూడా వెలువడక ముందే మేయర్, చైర్మన్ పీఠాలపై కన్నేసిన అభ్యర్థులు తమ వర్గీయులను క్యాంపులకు తరలించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. వీరికి వారి వారి పార్టీలు కూడా సహకారాన్ని అందిస్తున్నాయి. 

అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులతో ఇప్పటికే కొన్ని చోట్ల క్యాంపులకు వెళ్లిపోగా, నేటి ఫలితాల ను బట్టి ‘క్యాంపు రాజకీయాలు మరింతగా ఎక్కువ కానున్నాయి.  

Also read: మున్సిపాలిటీల్లో పాగాకు పావులు కదుపుతున్న టీఆర్ఎస్

ఈ క్యాంపు రాజకీయాలకు ఏ లోకల్ ప్రాంతాలనో ఎన్నుకున్నారనుకుంటే పొరపాటే అవుతుంది. కీలకమైన కార్పొరేషన్లకు చెందిన అభ్యర్థులనయితే రాష్ట్రం దాటించడానికి కూడా సదరు పార్టీలు, ఆ పార్టీల తరుఫున పోటీ చేసిన అభ్యర్థులు. 

హైదరాబాద్‌ శివార్లలోని రిసార్టులు, వైజాగ్‌తో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను దీనికోసం ఎంచుకుంటున్నారు. గోవును ఎక్కువ మంది ఎంచుకుంటున్నట్టు టాక్ వస్తుంది. 

ఇప్పటికే టూర్‌ ఆపరేటర్ల నుండి ప్యాకేజీలను కొనుగోలు చేసిన పార్టీలు ఫలితాలు వెలువడగానే వారిని తీసుకొని అక్కడకు చెక్కేయాలని ప్లన్స్ వేస్తున్నారు. మేయర్, చైర్మన్ల  ఎన్నికకు మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉండడంతో వారందరిని ప్రలోభాలకు లోనవకుండా ఇక్కడి నుండి తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారు. 

గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ను తీసుకెళ్లి ఈనెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక కార్యక్రమానికి నేరుగా వచ్చేలా పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్యాంపులకయ్యే ఖర్చును భరించేందుకు చైర్మన్, మేయర్‌ ఆశావాహులు వెనుకాడకపోవడంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు మునిసిపాలిటీల్లో ఈ క్యాంపు రాజకీయాలు అత్యధికంగా కనబడే సూచనలున్నాయి. 

ఇంకొన్ని ముఖ్యమైన మునిసిపాలిటీల్లో కూడా ఇలాంటి క్యాంపు రాజకీయాలకు కొదవలేదనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. రాష్ట్రంలోని 50 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలిచిన వారు క్యాంపులకు వెళ్లే ఛాన్సులు అధికంగా కనబడుతున్నాయి. 

Also read; లైవ్ అప్ డేట్స్: తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు

మొత్తానికి క్యాంపు రాజకీయాలు రాష్ట్ర కేంద్ర ఏర్పాటుల్లోనే కాదు ఆఖరకు మునిసిపల్ ఎన్నికలకు కూడా వొచ్చేసింది. బహుశా వికేంద్రీకరణ అంటే ఇదేనేమో...!    

click me!