జనగామ టఫ్: టీఆర్ఎస్ రెబెల్స్ ను క్యాంప్ నకు తరలించిన కాంగ్రెసు

Published : Jan 25, 2020, 01:12 PM ISTUpdated : Jan 25, 2020, 02:31 PM IST
జనగామ టఫ్: టీఆర్ఎస్ రెబెల్స్ ను క్యాంప్ నకు తరలించిన కాంగ్రెసు

సారాంశం

జనగామ మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెసు పార్టీ నేతలు ఇద్దరు టీఆర్ఎస్ రెబెల్స్ ను క్యాంప్ నకు తరలించారు. బిజెపితో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ షాక్ ఇవ్వాలని కాంగ్రెసు భావిస్తోంది.

జనగామ: జనగామ మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెసు, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు చోటు చేసుకుంది. బిజెపి, కాంగ్రెసు పొత్తు పెట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. 

తమ వ్యూహంలో భాగంగా కాంగ్రెసు నేతలు ఇద్దరు టీఆర్ఎస్ రెబెల్స్ ను క్యాంప్ నకు తరలించారు. అయితే, టీఆర్ఎస్ ధీమాతో ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యులతో మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోవచ్చునని భావిస్తోంది. 

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ