మున్సిపల్ ఎన్నికలు: కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ

Published : Jan 25, 2020, 12:46 PM ISTUpdated : Jan 25, 2020, 02:32 PM IST
మున్సిపల్ ఎన్నికలు: కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ

సారాంశం

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కొడంగల్ మున్సిపాలిటీలో ఎదురు దెబ్బ తగిలింది. కొడంగల్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంది.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయన కొడంగల్ లో రెండు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. కొడంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. 

మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ 7 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెసు కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ కు అత్యధిక సమయం కేటాయించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. 

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ