మథిరలో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించిన మల్లు భట్టి, కానీ...

Published : Jan 25, 2020, 10:53 AM ISTUpdated : Jan 25, 2020, 02:36 PM IST
మథిరలో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించిన మల్లు భట్టి, కానీ...

సారాంశం

మథిర మున్సిపాలిటీలో కాంగ్రెసు ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మథిర నియోజకవర్గానికి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఖమ్మం: మథిర మున్సిపాలిటీలో కాంగ్రెసు నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చుక్కలు చూపిస్తున్నారు. కూటమి అభ్యర్థులు ఈ మున్సిపాలిటీలో ముందంజలో ఉన్నారు. మథిర శాసనసభ నియోజకవర్గానికి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న విషయ తెలిసిందే. అయితే, చివరకు టీఆర్ఎస్ నెగ్గుకొచ్చింది. మథిర మున్సిపాలిటీని అతి కష్టం మీద టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.

మథిర మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ కేవలం 10 వార్డుల్లోని పోటీ చేయగా, టీడీపీ 7 చోట్ల బరిలో ఉంది. సిపిఐ 2 చోట్ల సిపిఎం 3 చోట్ల పోటీపడింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బోణీ కొట్టింది. ఊహించనట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గాలి వీస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ వార్డుల్లో విజయాలు సాధిస్తున్నప్పటికీ టీఆర్ఎస్ ను అధిగమించలేకపోతోంది. 

ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం జవహరన్ గనర్ కార్పోరే,న్ ను టీఆర్ఎస్ గెలుచుకుంది. వర్ధన్పపేట, ధర్మపురి మున్సిపాలీటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 

బిజెపి అనూహ్యంగా పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని భావించిన బిజెపి తగిన స్థాయిలో ఫలితాలు సాధిస్తున్నట్లు అర్థమవుతోంది. పలు చోట్ల కాంగ్రెసు కన్నా బిజెపి ఆధిక్యంలో ఉంది. తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బోణీ కొట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భైంసాలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో నాలుగు వార్డుల్లో మజ్లీస్ విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు బిజెపి గెలుచుకుంది. 

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలకు, 9 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఈ స్థితిలో టీఆర్ఎస్ తన సత్తాను చాటుతోంది.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం