తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: బోణీ కొట్టిన బిజెపి

By telugu teamFirst Published Jan 25, 2020, 10:42 AM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బోణీ కొట్టింది. పలు మున్సిపాలిటీల్లో బిజెపి చెప్పుకోదగిన స్థాయిలో వార్డులను గెలుచుకుంటోంది. కాంగ్రెసు కన్నా బిజెపి మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది.

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బోణీ కొట్టింది. ఊహించనట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గాలి వీస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ వార్డుల్లో విజయాలు సాధిస్తున్నప్పటికీ టీఆర్ఎస్ ను అధిగమించలేకపోతోంది. 

ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం జవహరన్ గనర్ కార్పోరే,న్ ను టీఆర్ఎస్ గెలుచుకుంది. వర్ధన్పపేట, ధర్మపురి మున్సిపాలీటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 

బిజెపి అనూహ్యంగా పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని భావించిన బిజెపి తగిన స్థాయిలో ఫలితాలు సాధిస్తున్నట్లు అర్థమవుతోంది. పలు చోట్ల కాంగ్రెసు కన్నా బిజెపి ఆధిక్యంలో ఉంది. తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బోణీ కొట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భైంసాలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో నాలుగు వార్డుల్లో మజ్లీస్ విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు బిజెపి గెలుచుకుంది. 

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం  చేసుకుంది. ధర్మపురి మున్సిపాలిటీ లో 1,2,4,6,8,10,13,15 వార్డులలో టీఆర్ఎస్ విజయం సాధించింది.  ధర్మపురి మున్సిపాలిటీలో 3, 5, 7, 9, 11, 12, 14 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించిదంి.

కొత్తపల్లి మున్సిపల్ ఎన్నికల లెక్కింపు లో మొత్తం 12 వార్డులు గాను 11 టిఆర్ఎస్ విజయం 1 కాంగ్రెస్ గెలుపొందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అసిస్టెంట్ కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల కౌంటింగ్ ప్రక్రియ అధికారులు ప్రారంభించారు.

click me!