Telangana MLC Elections 2021: కరీంనగర్ లో ఉత్కంఠ... భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Dec 10, 2021, 10:10 AM ISTUpdated : Dec 10, 2021, 10:11 AM IST
Telangana MLC Elections 2021: కరీంనగర్ లో ఉత్కంఠ... భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ (వీడియో)

సారాంశం

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 8గంటలకే ప్రారంభమైన పోలింగ్ మద్యాహ్నం 4గంటల వరకు కొనసాగనుంది. 

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (telangana mlc election 2021) ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 స్థానాలకు నోటిపికేషన్ వెలువడగా ఆరుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 6చోట్ల ఇవాళ ఎన్నికలు అనివార్యం కాగా ఇవాళ(శుక్రవారం) ఉదయం నుండి పోలింగ్ జరుగుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ఇవాళ ఉదయం 8 గంటలకే పోలింగ్ (polling) ప్రారంభమయ్యింది.  మద్యాహ్నం 4గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ (trs party)కి సంపూర్ణ మెజారిటీ వున్నా స్థానిక సంస్థల ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 

వీడియో

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా (karimnagar district)లో ఎమ్మెల్సీ పోటీ ఆసక్తికరంగా మారింది.  ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఎదురుతిరిగి మరీ మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇతడికి బిజెపి (bjp), కాంగ్రెస్ పార్టీ (congress party)ల మద్దతు వుందన్న వార్త  టీఆర్ఎస్ ను కలవరపడుతోంది.  

Telangana MLC Polls: తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్ లలో పోలింగ్ జరుగుతోంది. ముందుజాగ్రత్తలో భాగంగా తమ ఓటర్లు చేజారకుండా  టీఆర్ఎస్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంపుల నుండి స్థానిక ప్రజా ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 
 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 8 పోలింగ్ కేంద్రాలుండగా 1324 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదిమంది అభ్యర్థులు పోటీలో వున్నారు. కరీంనగర్ జిల్లాలో గెలుపును టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 10 ఎసిపిలు, 26 మంది సిఐలు, 54 ఎస్సైలు,115 ఎఎస్సైలు, 323 మంది కానిస్టేబుల్ లతో భారీ భద్రత ఏర్పాటుచేసారు. 

read more  బయో డేటా కాదు బ్యాలన్స్ షీట్ చూసే టికెట్లు...ఇదీ కేసీఆర్ రాజకీయం..: గోనె ప్రకాష్ రావు

కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ (huzurabad) పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపుతో రవీందర్ సింగ్ వైపు నిలుస్తారా... తమ పార్టీ వైపే నిలుస్తారో తేలనుంది.  హుజూరాబాద్ లోని ఎంపీడీఓ కార్యలయం లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మండలాలకు చెందిన 180 మంది ఓటర్లు  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు మరియు భద్రత ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

ఇక ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల (rajanna siricilla)లో కూడా పోలింగ్ జరుగుతోంది. మంత్రి కేటీఆర్ ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ పార్టీ ఓటర్లు చేజారకుండా జాగ్రత్తపడ్డారు. సిరిసిల్ల  జడ్పీ కార్యాలయం లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 201 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాలుగు అంచెల భద్రతతో ఎన్నికలు మరియు భద్రత ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?