ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన తెలంగాణ మంత్రులు.. పోలీసుల షాక్

By telugu teamFirst Published Sep 24, 2019, 8:51 AM IST
Highlights

మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కార్లు అధికవేగంతో వెళ్తున్నట్టు సీసీ టీవీలో రికార్డు కావడంతో  ఆయా నాయకులకు చలాన్లు పంపారు. మంత్రుల కోసం రక్షణ శాఖ కేటాయించిన ఈ వాహనాల వేగ పరిమితి 100 కి.మీగా నిర్ణయించారు. కానీ ఈ వాహనాల వేగం దానిని కూడా దాటేస్తోంది.

తెలంగాణలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మోటారు వాహనచట్టం 2019 ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి ఈ అనుభవం ఎదురైంది. కాగా... ఇప్పుడు ఈ జాబితాలోకి తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు కూడా రావడం గమనార్హం.

మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కార్లు అధికవేగంతో వెళ్తున్నట్టు సీసీ టీవీలో రికార్డు కావడంతో  ఆయా నాయకులకు చలాన్లు పంపారు. మంత్రుల కోసం రక్షణ శాఖ కేటాయించిన ఈ వాహనాల వేగ పరిమితి 100 కి.మీగా నిర్ణయించారు. కానీ ఈ వాహనాల వేగం దానిని కూడా దాటేస్తోంది.

నిబంధనలను ఉల్లంఘించి అధిక స్పీడుతో వెళ్తున్న ఈ వాహనాలు ట్రాఫిక్‌ పోలీసుల సీసీ కేమేరాలకి దొరికాయి. మంత్రులు తరచుగా రాజధాని నుంచి ఎక్కడి కయినా పర్యటనలకి కానీ తమ నియోజకవర్గాలకు రాకపోకలు సాగించాలంటే ఓఆర్ఆర్, హైవేల మీద ప్రయాణించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆయ రహదారులపై గరిష్ఠ వేగాన్ని 100 కి.మీ.లుగా నిర్ణయించారు. 

కాగా... మంత్రుల కార్ల డ్రైవర్లు మాత్రం ఈ వేగాన్ని మించి నడుపుతూ స్పీడ్‌ గన్‌లకు చిక్కుతున్నారు. అధికారులు చలాన్లు పంపిన వారి లిస్ట్‌లో మంత్రులు హరీశ్‌రావు సహా, గంగుల, ఈటల, కొప్పుల కూడా ఉన్నారు. మరి దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
click me!