రాజీనామాకు సిద్దమా: బండికి మంత్రి వేముల సవాల్

Published : Feb 03, 2021, 03:27 PM IST
రాజీనామాకు సిద్దమా: బండికి మంత్రి వేముల సవాల్

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ లో కేంద్రం వాటా రూ. 200 కంటే మించితే రాజీనామాకు సిద్దమా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ లో కేంద్రం వాటా రూ. 200 కంటే మించితే రాజీనామాకు సిద్దమా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

బుధవారం నాడు ఆయన  బాన్సువాడలో రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యామ్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీ అంటే భారతీయ ఝుటా పార్టీ అని ఆయన విమర్శించారు. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచేయి చూపినా కూడ బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?