మద్యం మత్తులో కుమారుడిని చంపిన తల్లి

Published : Feb 03, 2021, 01:02 PM IST
మద్యం మత్తులో కుమారుడిని చంపిన తల్లి

సారాంశం

మంగళవారం సాయంత్రం కల్లు తాగిన పరమేశ్వరి అనే మహిళ రాత్రి సమయంలో ఆ మత్తులో తన కుమారుడు ధనుష్(2) ను హత్య చేసింది.


కడుపున పుట్టిన కొడుకును కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన తల్లే.. అతి కిరాతకంగా ప్రవర్తించింది. కన్న కుమారుడిని అతి దారుణంగా చంపేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చేవెళ్ల మండలం రామన్నగూడ గ్రామంలో ఓ మహిళ  తాగిన మత్తులో కన్న బిడ్డనే గొంతునులిమి చంపేసింది. మంగళవారం సాయంత్రం కల్లు తాగిన పరమేశ్వరి అనే మహిళ రాత్రి సమయంలో ఆ మత్తులో తన కుమారుడు ధనుష్(2) ను హత్య చేసింది. మద్యం తాగొద్దని ఆమె మామ మందలించడంతో ఆగ్రహానికి గురైన మహిళ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.

వెంటనే కుటుంబసభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్