తనయుడికి గోల్డ్ మెడల్.. తండ్రిగా కేటీఆర్ సంతోషం ఇది..

Published : Mar 01, 2019, 04:47 PM IST
తనయుడికి గోల్డ్ మెడల్.. తండ్రిగా కేటీఆర్ సంతోషం ఇది..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు  గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు  గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. తనయుడికి గోల్డ్ మెడల్ రావడం పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కొడుకుని చూసి మురిసిపోయారు. అంతేకాదు.. ఆ సంతోషాన్ని ఇంట్లో సంబరం కూడా చేశారు. 

కేకు తెచ్చి కుమారుడితో కట్ చేయించి.. ఆనందం పంచుకున్నారు. ఈ సంబరాల్లో కేసీఆర్ మేనల్లుడు, ఎంపీ సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు. వారి ఆనందం అంతా.. పై ఫోటోలోనే కనిపిస్తోంది. 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ తాజాగా  బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌  నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ విభాగంలో హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి బంగారు పతకం సాధించాడు.  కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!