మాంసం అధిక ధరలకు విక్రయిస్తే.. కఠిన చర్యలు తప్పవు: తలసాని హెచ్చరిక

By Siva Kodati  |  First Published Apr 20, 2020, 4:30 PM IST

కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధిక ధరలకు మాంసాన్ని విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాంసం విక్రయశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తలసాని అధికారులను ఆదేశించారు. 


వేసవి దృష్ట్యా జీవాలకు పశుగ్రాసం కొరత లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు  తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

సోమవారం పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సిబ్బందికి శానిటైజర్‌లు, గ్లౌజ్‌లు పంపిణీ చేసిన మంత్రి మాట్లాడుతూ... గోశాలల నిర్వాహకులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Latest Videos

undefined

Also Read:మే 7 వరకు తెలంగాణలో లాక్‌డౌన్.. సడలింపులు ఉండవు: కేసీఆర్ ప్రకటన

1962 సేవలు సక్రమంగా అందేలా ప్రతిరోజూ పర్యవేక్షించాలని తలసాని కోరారు. కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధిక ధరలకు మాంసాన్ని విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మాంసం విక్రయశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తలసాని అధికారులను ఆదేశించారు. గోపాలమిత్రల 2 నెలల వేతనాలను ఈ రోజు విడుదల చేస్తామంత్రి మంత్రి స్పష్టం చేశారు.

Also Read:18 ఏళ్ల కిందట చంద్రబాబు కట్టించారు: ఇప్పుడు తెలంగాణకు అక్కరొచ్చింది

నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న స్లాటర్ హౌస్ ల సమాచారం సేకరించాలని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి తదితరులు పాల్గొన్నారు.

కాగా రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం నాటికి రాష్ట్రంలో 858 మందికి కోవిడ్ 19 సోకినట్లు కేసీఆర్ వెల్లడించారు. 

click me!