18 ఏళ్ల కిందట చంద్రబాబు కట్టించారు: ఇప్పుడు తెలంగాణకు అక్కరొచ్చింది

By telugu teamFirst Published Apr 20, 2020, 3:16 PM IST
Highlights

చంద్రబాబు 18 ఏళ్ల కిందట గచ్చిబౌలిలో కట్టించిన స్పోర్ట్స్ విలేజ్ లోని భవనం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పనికి వచ్చింది. దాన్ని కరోనా వైరస్ రోగులకు టిమ్స్ ఆస్పత్రిగా మార్చారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడో 18 ఏళ్ల కిందట కట్టించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అక్కరకు వచ్చింది. 2002 లో హైదరాబాద్ లో జాతీయ క్రీడలు నిర్వహించినప్పుడు గచ్చిబౌలి లో స్పోర్ట్స్ విలేజ్ కట్టించారు. అందులో కొంత అమ్మి కొంత ప్రభుత్వం కింద ఉంచారు. 14 అంతస్థులతో 540 గదులు ప్రభుత్వం కింద ఉన్నాయి. 

హైదరాబాద్ లో స్పోర్ట్స్ ఈవెంట్లు జరిగినప్పుడు వస్తున్న వారికి వసతి కోసం ఇన్నాళ్లు వాడారు. ఇప్పుడు అందులో టిమ్స్ పేరుతో హాస్పిటల్ పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించడానికి దాన్ని ఆస్పత్రిగా మార్చారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా రెడీమేడ్ గా ఉన్న భవనంలో దీనిని పెడుతున్నారు. ప్రభుత్వం దానిని వాడుకోవడం తప్పేం కాదు. అధికారం లో ఉన్నప్పుడు ముందుచూపుతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే తర్వాత అవి ఎలా ఉపయోగ పడతాయనడానికి ఇది ఒక ఉదాహరణ. 

హైదరాబాద్ లో ముషీరాబాద్ లో ఉన్న జైలు తొలగించి చంద్రబాబు ప్రభుత్వం గాంధీ హాస్పిటల్ కొత్త భవనం కట్టింది. ఇప్పుడు అందులోనే గాంధీ ఆస్పత్రి నడుస్తోంది. 2004 లో చంద్రబాబు దిగిపోయి ఇప్పటికి 16 సంవత్సరాలు. ఈ 16 ఏళ్లలో హైదరాబాద్ జనాభా రెట్టింపు అయింది. ఇప్పుడు ఇన్ని రోజులకు ఒక కొత్త ఆస్పత్రి పెడతామని అంటున్నారు. అదీ చంద్రబాబు కట్టించిన భవనంలో. 

హైదరాబాద్ లో బొక్కల ఆస్పత్రి గా పిలిచే నిమ్స్ ను ఎన్టీఆర్ బాగా డెవెలప్ చేశారు. అమెరికా నుంచి డాక్టర్ కాకర్ల  సుబ్బారావు ను పిలిపించి ఆయన చేతికి నిమ్స్ అప్పగిస్తే దానిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చి దిద్దారు. చంద్రబాబు హయాంలో అది ఇంకా పెరిగింది. మంత్రులు కూడా అక్కడే చికిత్స చేయించుకొనేవారు.

click me!