ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రి పదవులు చెప్పుకోవడానికే ఉండేవని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
హైదరాబాద్ :తెలంగాణలో సీఎం కేసీఆర్ కు సైన్యం ఉందని రాష్ట్ర స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.గురువారంనాడు మంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సైన్యం చావడానికైనా, చంపడానికైనా సిద్దమేనని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ను రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎవరి బెదిరింపులకు తాము భయపడబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.అన్ని అంశాలపై పట్టున్నవారికే కేసీఆర్ సీఎం పదవులు అప్పగించారన్నారు.
2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి శ్రీనివాస్ గౌడ్ రెండో దఫా విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో శ్రీనివాస్ గౌడ్ కు కేసీఆర్ మంత్రిపదవిని కేటాయించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల సంఘం నేతగా శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించారు. 2014లో తొలిసారిగా మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018లో ఆయన రెండోసారి అదే స్థానం నుండి విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో వనపర్తి నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నిరంజన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో జిల్లా నుండి జడ్చర్ల నుండి విజయం సాధించిన డాక్టర్ లక్ష్మారెడ్డికి మంత్రి పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి కేసీఆర్ మంత్రి పదవిని ఇవ్వలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు మంత్రి పదవులను కేసీఆర్ కేటాయించారు.