ఢిల్లీలో బీజేపీ నేతలను కలిశారు: వైఎస్ షర్మిలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

By narsimha lode  |  First Published Nov 30, 2022, 5:11 PM IST

బీజేపీ నేతలతో  షర్మిలకు  సంబంధాలున్నాయని  తెలంగాణ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  ఆరోపించారు.ఢిల్లీకి  వెళ్లిన సమయంలో షర్మిల బీజేపీ నేతలతో  చర్చించారని చెప్పారు.
 


హైదరాబాద్: ఢిల్లీ వెళ్లిన  సమయంలో  వైఎస్ షర్మిల బీజేపీ నేతలను కలిసి వచ్చారని  తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఆరోపించారు. బుధవారంనాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్  షర్మిల పై తెలంగాణ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  మండిపడ్డారు. 
ఆడబిడ్డ అని  ఇప్పటివరకు ఓపిక పట్టామన్నారు. సుదర్శన్ రెడ్డిని మగడివా  అని   విమర్శించడంతో  ఆయన అనుచరవర్గం ఆగ్రహనికి షర్మిల గురైందని ఆయన చెప్పారు. తెలంగాణలో జరిగే అభివృద్దిని  చూసి ఓర్వలేక దృష్టి  మరల్చే ప్రయత్నం చేస్తున్నారని షర్మిలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్  విమర్శించారు.

also read:షర్మిల భాషను చూసి సిగ్గుపడుతున్నాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత

Latest Videos

టీఆర్ఎస్, వైఎస్ఆర్‌టీపీ  మధ్య మాటల యుద్ధం  సాగుతుంది. తన పోరాటానికి మద్దతిచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొండా సురేఖలకు షర్మిల ధన్యవాదాలు చెప్పారు. అదే సమయంలో  తెలంగాణ సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై టీఆర్ఎస్  నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చడాన్ని టీఆర్ఎస్  నేతలు తప్పుబడుతున్నారు. కేసీఆర్ ను తాలిబన్  అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని టీఆర్ఎస్  నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇదే తరహలోనే షర్మిల వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో  జరిగే  ఘటనలకు తాము బాధ్యులం కాబోమన్నారు.తెలంగాణకు వైఎస్ఆర్ కుటుంబం వ్యతిరేకంగా  పనిచేసిందని  టీఆర్ఎస్  ఎమ్మెల్యే బాల్క సుమన్  చెప్పారు. మరో వైపు షర్మిల వ్యాఖ్యలు మహిళలు తలదించుకొనేలా  ఉన్నాయని  టీఆర్ఎస్  ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు.
 

click me!