
సిద్ధిపేటలో కొత్తగా నిర్మించిన అక్బర్‌పేట్ భూంపల్లి ఎంఆర్‌వో కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. అయితే బీజేపీ , టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీపోటీ నినాదాలు చేశారు. తర్వాత ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అక్కడే వున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.