ఎట్టకేలకు బాటసింగారానికి తరలిపోయిన గడ్డి అన్నారం ఫ్రూట్స్ మార్కెట్

By Siva KodatiFirst Published Oct 15, 2021, 7:12 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌‌ను శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌‌ను తరలించి బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌‌ను శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌‌ను తరలించి బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని గడ్డిఅన్నారం నుంచి బాటసింగారం లాజిస్టిక్‌ పార్క్‌లో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకు కమీషన్‌ ఏజెంట్లు సహకరించాలని సబిత కోరారు.   

వ్యాపారులంతా సహకరిస్తే వీలైనంత త్వరలోనే కొహెడలో శాశ్వత ప్రాతిపదికన అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ నిర్మాణం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. అప్పటి వరకు పండ్ల క్రయ, విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సబిత హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగించేందుకు సిద్ధమని .. ఏ ఒక్క వ్యాపారీ కూడా అనుమానం, అపోహలకు గురికావొద్దని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం ఉంటుందని ఆమె చెప్పారు. 

Latest Videos

Also Read:గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌‌పై హైకోర్టు ఆదేశాలు: సుప్రీంలో తెలంగాణ సర్కార్ సవాల్

కాగా.. గడ్డి అన్నారం  ఫ్రూట్ మార్కెట్‌‌ను బాట సింగారానికి తరలింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. Gaddiannaram fruit market స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ  ఫ్రూట్ మార్కెట్‌ను bata singaram గ్రామ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజంట్స్ అసోసియేషన్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై   telangana high court  విచారించింది. అనంతరం ఈనెల 18వ తేదీ వరకు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం దసరా సెలవుల తర్వాత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

hyderabadలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రస్తుతమున్న ఆసుపత్రులతో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రలను నిర్మించనుంది.ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం స్థలాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ఆసుపత్రిని నిర్మించాలని నిర్మించనున్నారు. మరో రెండు ఆసుపత్రుల కోసం స్థలాలను ప్రభుత్వం అన్వేషణ చేస్తోంది.
 

click me!