ఆచార్య సెట్ లో చిరంజీవితో పువ్వాడ అజయ్ భేటీ: మతలబు?

Published : Jan 30, 2021, 12:21 PM IST
ఆచార్య సెట్ లో చిరంజీవితో పువ్వాడ అజయ్ భేటీ: మతలబు?

సారాంశం

ఈ సినిమా సెట్స్ లో మెగా స్టార్ చిరంజీవిని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలవడం గమనార్హం. దీంతో.. ఇంత సడెన్ గా మంత్రి వచ్చి చిరంజీవిని ఎందుకు కలిశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల చేశారు. ఆ టీచర్ మెగా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. మిగితా సినిమా షూటింగ్ కొనసాగుతోంది.

అయితే... ఈ సినిమా సెట్స్ లో మెగా స్టార్ చిరంజీవిని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలవడం గమనార్హం. దీంతో.. ఇంత సడెన్ గా మంత్రి వచ్చి చిరంజీవిని ఎందుకు కలిశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే ఆరా తీయడం కూడా మొదలైంది.

కాగా.. చిరంజీవిని కలిసిన విషయాన్ని పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్‌ ప్రదేశంలో మంత్రి కనిపించారు. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు కొరటాల శివ వివరించారు. ఈ మేరకు మంత్రి అజయ్‌ ట్వీట్‌ చేశారు. చిరంజీవితో దిగిన ఫొటోలు పంచుకున్నారు. ఆ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే మంత్రి ఎందుకు కలిశారో అనేది తెలియడం లేదు. 

మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి పక్కన జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయ్యింది. మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. 

 

PREV
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu