మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Published : Feb 17, 2020, 01:27 PM IST
మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

హైదరాబాదులోని బంజారాహిల్స్ వెంగళరావు పార్కు వద్ద తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అజయ్ కాన్వాయ్ లోని వాహనాలు ఒక్కదాన్నొక్కటి ఢీకొట్టాయి.

హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ ఆజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆయన కాన్వాయ్ లో సోమవారం ప్రమాదం జరిగింది. మంత్రి కాన్వాయ్ లోని వాహనాలు ఒక్కదాన్నొక్కటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. 

కాన్వాయ్ లోని మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంగళరావు పార్కు వద్ద ఓ బైక్ ను తప్పించబోయి మంత్రి కాన్వాయ్ లోని వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం తర్వాత మంత్రి వేరే వాహనంలో వెనుదిరిగి వెళ్లిపోయారు. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?