కేసీఆర్ కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు: కేటీఆర్ వెరైటీగా...

Published : Feb 17, 2020, 12:14 PM IST
కేసీఆర్ కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు: కేటీఆర్ వెరైటీగా...

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనయుడు కేటీఆర్ వెరీటీగా కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ కు ట్యాగ్ చేశారు.  

"భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు అన్నారు.

 

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తండ్రి కేసీఆర్ కు కుమారుడు, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ #HappyBirthdayKCR అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu