అడ్డంగా బుక్కైన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

By Nagaraju penumalaFirst Published Apr 24, 2019, 12:15 PM IST
Highlights

కీలక అంశాలపై, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ లెటర్ హెడ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ అడ్డంగా బుక్కైపోయారు. పార్టీ లెటర్ హేడ్ పై ఇవ్వాల్సిన అపాయింట్ మెంట్ లెటర్ కాస్త ప్రభుత్వ లెటర్ హెడ్ పై ఇచ్చి దొరికిపోయారు. 
 

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి చామకూర మల్లారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఉత్సాహం ఎక్కువైనా తట్టుకోలేరు. నిరుత్సాహం వచ్చినా సహించలేరు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అనేది కనిపెట్టడం సాధ్యం కాదు.

ఒక్కోసారి పెద్ద రాజకీయ నాయకుడిలా మాట్లాడతారు. అదే సమయంలో చిన్నపిల్లాడిలా మారిపోయి చిందులేస్తారు. ఏది ఏమైనప్పటికీ మల్లారెడ్డి రూటే సెపరేట్ అంటుంటారు రాజకీయాల్లో. తెలుగుదేశం పార్టీ తరపున మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి అనంతరం నియోజకవర్గం అభివృద్ధిపేరుతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 

2018 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు ఎవరూ ఊహించనట్లుగా కేసీఆర్ కేబినేట్ లో ఛాన్స్ కూడా కొట్టేశారు. మంత్రి పదవి చేపట్టారో లేదో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నాలుక్కరచుకున్నారు. 

తాజాగా మరోసారి ఆయన బుట్టలో కాలేశారు. కీలక అంశాలపై, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ లెటర్ హెడ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ అడ్డంగా బుక్కైపోయారు. పార్టీ లెటర్ హేడ్ పై ఇవ్వాల్సిన అపాయింట్ మెంట్ లెటర్ కాస్త ప్రభుత్వ లెటర్ హెడ్ పై ఇచ్చి దొరికిపోయారు. 

ఆయన మంత్రిత్వ శాఖకు చెందిన లెటర్ హెడ్ పై కీసర మండల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడిగా జలపురం సుధాకర్ రెడ్డిని నియమిస్తూ అపాయింట్ మెంట్ లెటర్ జారీ చేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వాడాల్సిన లెటర్ హెడ్ ను పార్టీ వ్యవహారాలకు వినియోగించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

లెటర్ హెడ్ కదా ఎవరూ పట్టించుకోరులే అనుకుంటున్నారో ఏమో కానీ దాని వాల్యూ వేరు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. సో మంత్రి మల్లారెడ్డిగారూ జాగ్రత్త అంటూ సూచలు సైతం ఇస్తున్నారట.  
 

click me!