జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: రేపటి నుండి కేటీఆర్ ప్రచారం

Published : Nov 20, 2020, 06:06 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: రేపటి నుండి కేటీఆర్ ప్రచారం

సారాంశం

 జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 21వ తేదీ నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.  

హైద్రాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుండి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల వరకు కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొంటారు.

ఈ నెల 21న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 22న మహేశ్వరం, ఎల్ బీ నగర్ నియోజవకర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేస్తారు.ఈ నెల 28వ తేదీన ఎల్ బీ స్టేడియంలో  బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020:తుది జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్

టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్ పేర్లను టీఆర్ఎస్ ప్రకటించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని ఈ సభలో కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 4వ తేదీన  ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

ఈ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ దఫా జీహెచ్ఎంసీని కైవసం చేసుకొనేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది.మరోవైపు బల్దియా పీఠంపై  రెండోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

 

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్