ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్, మంచినీళ్లు కూడా లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో అత్యుత్తమ నగరాల్లో హైద్రాబాద్ ఒకటని ఆయన చెప్పారు.
హైదరాబాద్: Andhra Pradesh రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తనకు కొందరు చెప్పారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR చెప్పారు. దేశంలోని అన్ని నగరాల్లో కెల్లా హైద్రాబాదే అత్యుత్తమ నగరంగా ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం నాడు Hyderabadలో జరిగిన క్రెడాయి 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో Roads ధ్వసంమయ్యాయన్నారు. Electricity , Drinking Water కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లేసుకొని వెళ్లి రావాలని కేటీఆర్ సూచించారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదన్నారు.
undefined
Live: Addressing the gathering at the 11th edition of Property Show https://t.co/L9yuJFxuLt
— KTR (@KTRTRS)ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో మన వాళ్లు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లంచాలు ఇస్తేనే అనుమతులు వస్తాయని కేటీఆర్ ఆరోపించారు.పరిశ్రమలకు ెపారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ అప్పు చేసి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తు తరాల మీద పెట్టేది పెట్టుబడి అవుతుందనికేటీఆర్ చెప్పారు.111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఈ జీవోను నా కోసమే ఎత్తివేశారని ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో కూడా ఈ జీవోను ఎత్తివేసేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.1.30 లక్షల ఎకరాలు నావేనా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ 111 జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.
ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టే ఉందని ఆ ప్రాంతానికి చెందినవారు తనకు చెప్పారని కేటీఆర్ వివరించారు. బెంగుళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండిపడుతున్నాయని కేటీఆర్ చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ప్రశాంతమైన రాష్ట్రమని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో ఏపీ వాసులకు అర్ధమైందని కేటీఆర్ చెప్పారు.
మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఎఫ్ఎస్ఐ పెట్టామని కేటీఆర్ చెప్పారు.ఆన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే అన్ లిమిటెడ్ గ్రీడ్ కాదన్నారు.ఎలా కడుతున్నారు, ఎంత అన్యాయంగా భవనాలు నిర్మిస్తున్నారో ఆలోచించుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా బిల్డర్లకు క్లాస్ తీసుకున్నారు. బిల్డర్లు స్వీయ నియంత్రణను పాటించాలని సూచించారు