నేడు హైద్రాబాద్‌కి మాణికం ఠాగూర్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎపిసోడ్ సహా ఇతర అంశాలపై చర్చ

Published : Apr 29, 2022, 11:58 AM IST
నేడు హైద్రాబాద్‌కి మాణికం ఠాగూర్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎపిసోడ్ సహా ఇతర అంశాలపై చర్చ

సారాంశం

మే 6న వరంగల్ లో జిరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లపై మాణికం ఠాగూర్ చర్చించనున్నారు.జిల్లాల్లో పార్టీ నేతల తీరుపై కూడా చర్చించనున్నారు. ఇవాళ జరిగే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్: తెలంగాణ Congress పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదనే విషయం నల్గొండలో రేవంత్ రెడ్డి సమావేశం విషయంతో బట్టబయలైంది. Revanth Reddy ని Nalgonda జిల్లాలో సమావేశానికి రావొద్దని Komtireddy Venkat Reddy బహిరంగంగా ప్రకటించడం చర్చకు దారి తీసింది. అయితే  రేవంత్ రెడ్డి కూడా Nagarjuna Sagar లో  శుక్రవారం నాడు సమావేశం ఏర్పాటు చేయించారు. కేంద్ర మంత్రి Nitin Gadkari సమావేశం ఉన్నందున తాను ఈ సమావేశానికి రాలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.  ఈ పరిణామాలపై  ఇవాళ సాయంత్రం జరిగే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో చర్చించనున్నారు.

Congress పార్టీ Telangana రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ నేతృత్వంలో ఇవాళ సాయంత్రం Gandhi Bhavan లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. 

ఈ ఏడాది మే 6న Warangal లో  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi టూర్ ఉంది. ఈ సభను జయప్రదం  చేసేందుకు గాను జిల్లాల వారీగా ఈ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే Khammam  జిల్లా టూర్ తర్వాత నల్గొండ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ సమావేశం గురించి తమకు తెలియకుండా నిర్ణయించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అసంతృప్తిని వ్యకతం చేశారు. అంతేకాదు రాహుల్ సబకు జన సమీకరణకు గాను నల్గొండ జిల్లాకు మాజీ మంత్రి గీతారెడ్డిని ఇంచార్జీగా కూడా నియమించారు. గీతారెడ్డిని జిల్లాకు రావొద్దని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. మూడు రోజుల క్రితం జరగాల్సిన రేవంత్ రెడ్డి సమావేశం రద్దు చేసుకొనేలా చేశారు. అయితే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం నిర్వహించాలని రేవంత్ రెడ్డి నల్గొండ డీసీసీని ఆదేశించారు. ఇదే విషయమై Jana Reddy తో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్చించారు.  అయితే పీసీసీ చీఫ్ ను నల్గొండ జిల్లాకు రావొద్దని చెప్పడం సరైంది కాదని   ఉత్తమ్ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు జానారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరగకుండా ఉండేందుకు గాను మాజీ మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకొన్నారు. నాగార్జున సాగర్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం వద్దని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు ఉన్న నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి సమావేశం అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. జానారెడ్డికి ఏం అవసరం ఉందో ఈ సమావేశం ఏర్పాటు చేశారని కూడా తన అయిష్టతను వ్యక్తం చేశారు. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యక్రమం ఇవాళ శంషాబాద్ లో ఉంది. ఈ కార్యక్రమానికి తాను హాజరౌతున్న నేపథ్యంలో తాను ఈ సమావేశానికి రానని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్ననే ప్రకటించారు. తమ నేతలను సమావేశానికి హాజరు కావాలని చెప్పానని వివరించారు. మరో వైపు ఇవాళ భువనగిరి నియోజకవర్గానికి చెందిన నేతలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy నిర్వహించాల్సిన సమావేశాన్ని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రద్దు చేయించారు.

ఇవాళ ఉదయం నాగార్జున సాగర్ కు బయలుదేరే ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  రేవంత్ రెడ్డి మేసేజ్ పంపారు.  నల్గొండ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ సమావేశం ఉన్నందున తాను సమావేశానికి రాలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిప్లై ఇచ్చారు.రేపు కలిసి మాట్లాడుకుందామని వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డికి మేసేజ్ చేశారు. మరో వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. 

రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల విషయమై పార్టీ నేతలతో చర్చించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ Manickam Tagore ఇవాళ హైద్రాబాద్ కు రానున్నారు. నల్గొండ సమావేశానికి సంబంధించి నేతల అనుసరించిన తీరుపై చర్చించే అవకాశం ఉంది.  రేవంత్ రెడ్డిని సమావేశం నిర్వహిందచవద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చయడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంతర్గతంగా తతంగం సాగిస్తున్నారని కొంతకాలంగా రేవంత్ శిబిరం ఆరోపణలు చేస్తుంది. నల్గొండ సమావేశం వ్యవహరంతో ఈ విషయం రుజువైందని రేవంత్ వర్గం వాదిస్తుంది. 

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిని తమ జిల్లాకు రావొద్దని చెబుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ జిల్లాల్లో ఎలా పర్యటిస్తారని కూడా కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ హోదాలో మే 1,2 తేదీల్లో పర్యటించనున్నారు. అయితే తమ జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రావాల్సిన అవసరం లేదని కామారెడ్డి డీసీసీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఇవాళ జరిగే పొలిటికల్ ఎఫైర్స్ సమావేశం హాట్ హాట్ గా జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్