చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై ఆందోళన : కొడుకుగా ఆ బాధ నాకూ తెలుసు, లోకేష్‌ ట్వీట్‌పై కేటీఆర్ ఆవేదన

By Siva Kodati  |  First Published Oct 13, 2023, 9:25 PM IST

తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు . చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ బాధను ఒక కొడుకుగా అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. రాజకీయాలు , పార్టీలు వేరైనా చంద్రబాబు కుటుంబం బాధను అర్ధం చేసుకోగలనని కేటీఆర్ తెలిపారు . 
 


ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్నారు. అయితే ఆయన ఆరోగ్యం, భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం చంద్రబాబు స్కిన్ అలర్జీ బారినపడటంతో  వైద్యులు చికిత్స అందించడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. 

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ట్వీట్ చూసి బాధగా అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ బాధను ఒక కొడుకుగా అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. లోకేష్ చెప్పింది నిజమైతే ఆ పరిస్ధితి బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు తనకు తెలియవని, కానీ చంద్రబాబు భద్రతకు ప్రమాదమైతే మాత్రం అది రాజకీయాల్లో దురదృష్టకరమన్నారు. రాజకీయాలు , పార్టీలు వేరైనా చంద్రబాబు కుటుంబం బాధను అర్ధం చేసుకోగలనని కేటీఆర్ పేర్కొన్నారు. 

Latest Videos

తెలంగాణ ఉద్యమ సమయంలో నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు ఆయన ఆరోగ్యంపై తామంతా ఆందోళన వ్యక్తం చేశామని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం విషమించేలా వుందని అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు తమను హెచ్చరించారని మంత్రి తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో మానసిక స్ధితి ఎలా వుంటుందో తాను అర్ధం చేసుకోగలనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.  టీడీపీ శ్రేణులు , మద్ధతుదారులు చేస్తున్న ఆందోళనల వల్ల హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దన్న ఉద్దేశంతోనే ఇక్కడ నిరసనలు వద్దు అన్నానని మంత్రి చెప్పారు. ఇరు పార్టీల మధ్య వున్న రాజకీయాల్లోకి తెలంగాణను లాగవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

 

భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారు. ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ ప్ర‌భుత్వం. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబు గారిని అనారోగ్య… pic.twitter.com/1KA2ZGaWaB

— Lokesh Nara (@naralokesh)

 

అంతకుముందు తన తండ్రి ఆరోగ్యంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘‘ భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారు. ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ ప్ర‌భుత్వం. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబు గారిని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే ప్ర‌ణాళిక ఏదో ర‌చిస్తున్నారు ’’ .

‘‘ చంద్ర‌బాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్ప‌దంగా ఉంది. జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబు గారిని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో ప‌దే ప‌దే పేర్కొనేందుకు పెట్టిన శ్ర‌ద్ధ ఆయ‌న ఆరోగ్యం, భ‌ద్ర‌త‌పై పెట్ట‌డంలేదు. చంద్ర‌బాబు గారికి ఏ హాని జ‌రిగినా, సైకోజ‌గ‌న్ స‌ర్కారు, జైలు అధికారుల‌దే బాధ్య‌త‌.’’ అని ఆయన పేర్కొన్నారు ’’. 

click me!