విశాఖలో విషవాయువు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందన

By telugu news teamFirst Published May 7, 2020, 12:26 PM IST
Highlights

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు కేటీఆర్.
 

విశాఖపట్నం నగరంలో విష వాయువు కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. కాగా... ఇప్పటి వరకు ఈ గ్యాస్ లీక్ కారణంగా 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2వేల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.

Shocked & deeply anguished by the visuals from

My wholehearted condolences to those who lost their near & dear. Let’s pray for the well-being of the hospitalised 🙏

What a horrible year this has been!

— KTR (@KTRTRS)

కాగా..  ఈ ఘటనపై తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఈ ఘటనపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు కేటీఆర్.

కాగా విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జగన్‌ వైజాగ్ వెళ్లనున్నారు. 11.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందగా, 80 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

click me!