తప్పుడు ప్రచారంపై న్యాయపరంగా ఎదుర్కొంటా: ఎన్జీటీ నోటీసులపై కేటీఆర్

By narsimha lodeFirst Published Jun 6, 2020, 8:06 PM IST
Highlights

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఫామ్ హౌస్  భూమి నాది కాదు, తనపై తప్పుడు ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
 


హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఫామ్ హౌస్  భూమి నాది కాదు, తనపై తప్పుడు ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం నాడు స్పందించారు.ఓ కాంగ్రెస్ పార్టీ నేత ఉద్దేశ్యపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

also read:కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు: ఫామ్‌హౌస్‌పై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక

ఆ భూమి తనది కాదు.. ఇప్పటికే ఆ విషయంపై స్పష్టత ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. తనపై చేసిన తప్పుడు ప్రచారంపై న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన ప్రకటించారు.ఇవన్నీ అసత్య ఆరోపణలన్నీ నిరూపిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్‌హౌస్ ను మంత్రి కేటీఆర్ ది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవోకి విరుద్దంగా ఈ ఫామ్‌హౌస్ లో నిర్మాణాలు చేపట్టారని రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.

దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విషయమై నోటీసులు జారీ చేసింది. ఈ ఫామ్ హౌస్ లో 111 జీవోకు విరుద్దంగా నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని నిజనిర్ధారణ చేయాలని కూడ ఎన్జీటీ ఆదేశించింది. ఈ మేరకు నిజనిర్ధారణ కమిటిని కూడ ఏర్పాటు చేసింది. 
 

click me!