హైద్రాబాద్ నగరంలోని అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం బాధాకరమని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మంగళవారంనాడు హైద్రాబాద్ లో మంత్రి కేటీఆర్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం హైద్రాబాద్ అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందాడు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. యానిమల్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి చెప్పారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇంధల్వాయి మండలకేంద్రానికి చెందిన గంగాధర్ హైద్రాబాద్ అంబర్ పేటలో నివాసం ఉంటున్నాడు. అంబర్ పేట కారు సర్వీస్ సెంటర్ లో ఆయన వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అంబర్ పేటలో అద్దె ఇంట్లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. గంగాధర్ కు ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల వయస్సున్న కూతురు. నాలుగేళ్ల ప్రదీప్ ఉన్నారు. ఆదివారం నాడు ఇద్దరు పిల్లలను తాను పనిచేసే కారు సర్వీసింగ్ సెంటర్ వద్దకు తీసుకువచ్చాడు.
ఆదివారం నాడు సెలవు దినం కావడంతో తన కూతురు, కొడుకును తీసుకెళ్లాడు. పిల్లలతో గడపాలనే కోరికతో గంగాధర్ పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. పిల్లలను గమనిస్తూనే ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఆడుకుంటూ ప్రదీప్ తన సోదరి వద్దకు వెళ్లే సమయంలో వీధి కుక్కలు ప్రదీప్ పై దాడి చేశాయి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రదీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

also read:విషాదం : నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలతో చిన్నారి మృతి..