తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చా: కౌశిక్ రెడ్డి

Published : Feb 21, 2023, 12:40 PM IST
తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలపై  మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చా: కౌశిక్ రెడ్డి

సారాంశం

జాతీయ మహిళా కమిషన్‌  కు   తన వ్యాఖ్యలపై  వివరణ ఇచ్చినట్టుగా  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి  చెప్పారు. ఇవాళ  జాతీయ మహిళా కమిషన్ ముందు  ఆ యన హజరయ్యారు. 

న్యూఢిల్లీ:  గవర్నర్ పై  వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌కు  వివరణ ఇచ్చినట్టుగా  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  పాడి కౌశిక్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ గవర్నర్ పై  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో  జాతీయ మహిళా కమిషన్ కౌశిక్ రెడ్డికి  నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు  రావాలని  ఆదేశించింది.  దీంతో జాతీయ మహిళా  కమిషన్ ముందు  ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి హజరయ్యారు.   జాతీయ మహిళా కమిషన్   విచారణ ముగిసిన తర్వాత  కౌశిక్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.తనకు  జాతీయ మహిళా కమిషన్ నుండి  నోటీసులు అందడంతో  ఇవాళ విచారణకు  హజరైనట్టుగా  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశికక్ రెడ్డి  చెప్పారు. 

also read:తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలు: జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి

ఈ వ్యాఖ్యలపై  తాను  మహిళా కమిషన్ కు  వివరణ ఇచ్చినట్టుగా  కౌశిక్ రెడ్డి  తెలిపారు.  ఈ విషయమై  హైద్రాబాద్ లో  మీడియా సమావేశం  ఏర్పాటు  చేసి అన్ని వివరాలను చెబుతానని  కౌశిక్ రెడ్డి  ప్రకటించారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?