అర్ధాంతరంగా ముగిసిన చర్చలు: ఈ నెల 20న మరోసారి వీఆర్ఏలతో చర్చలకు కేటీఆర్ హామీ

By narsimha lodeFirst Published Sep 13, 2022, 2:25 PM IST
Highlights

ఈ నెల 20వ తేదీన మరోసారి సమావేశం కావాలని వీఆర్ఏ సం:ఘం ప్రతినిధులను కోరారు. ఇవాళ  అరగంటకు పైగా వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో కేటీఆర్ చర్చించారు. ఆందోళనను విరమించాలని కోరారు. 20వ తేదీన డిమాండ్లపై నిర్ణయం తీసుకొంటామని కేటీఆర్ ప్రకటించారు. 


హైదరాబాద్: వీఆర్ఏ ప్రతినిధులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ నిర్వహించిన చర్చలు ముగిశాయి. మంగళవారం నాడు చలో అసెంబ్లీకి వీఆర్ఏల సంఘం పిలుపునిచ్చింది. అసెంబ్లీ వైపునకు వీఆఆర్ఏలు రాకుండా పోలీసులు బారికేడ్లు వేసి అడ్డుకున్నారు.ఈ సమయంలో వీఆర్ఏ సంఘం ప్రతినిధులను చర్చలకు ప్రబుత్వం ఆహ్వానించింది. 

తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు దాదాపుగా 40 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు కొనసాగింపుగా ఇవాళ  చలో అసెంబ్లీని వీఆర్ఏల సంఘం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

also read:వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో కేటీఆర్ భేటీ: వీఆర్ఏల డిమాండ్లపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో  వీఆర్ఏల సంఘం ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ అరగంటకు పైగా చర్చించారు. తమ డిమాండ్లను వీఆర్ఏ సంఘం ప్రతినిధులు కేటీఆర్ ముందుంచారు. పే స్కేల్ అమలు చేయడదంతో పాటు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని వీఆర్ఏ సంఘం డిమాండ్ చేసింది. అంతేకాదు  వయసు పైబడిన వారి కుటుంబ సభ్యులకు వీఆర్ఏలుగా అవకాశం కల్పించాలని కోరారు. సుమారు 15 డిమాండ్లను వీఆర్ఏ సంఘం ప్రతినిధులు కేటీఆర ముందుంచారు. గతంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈ విషయమై హామీలు ఇచ్చినట్టుగా సంఘం ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు.ఈ డిమాండ్లపై ఈ నెల 20వ తేదీన మరోసారి సమావేశం కావాలని వీఆర్ఏలతో చర్చించనున్నట్టుగా కేటీఆర్ తెలిపారు. దీంతో సమావేశం ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చల సారాంశాన్ని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న వీఆర్ఏలతో చర్చించిన మీదట తమ నిర్ణయం ప్రకటిస్తామని వీఆర్ఏ సంఘం ప్రతినిధులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆందోళనను విరమించాలని వీఆర్ఏ సంఘం ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు.  రాష్ట్రంలో జాతీయ సమైఖ్యత వజ్రోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విధులకు హాజరు కావాలని వీఆర్ఏలను మంత్రి కేటీఆర్ కోరారు. వీఆర్ఏ డిమాండ్లపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందనే విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 18 తర్వాత  చర్చలు జరుపుతామని కేటీఆర్ చెప్పారు. 

ఈనెల 20 వరకు శాంతియుతంగా ఆందోళనలు :వీఆర్ఏ సంఘం

తమ ప్రధానమైన మూడు డిమాండ్లపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని వీఆర్ఏ సంఘం పరతినిధులు చెప్పారు.  ఈ విషయమై ఈ నెల 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఈ నెల 20న జరిగే సమావేశంలో తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించారనే విశ్వాసాన్ని వీఆర్ఏ సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెల 20వ తేదీ వరకు శాంతియుతంగా తమ ఆందోళనలను శాంతియుతంగా కొనసాగిస్తామని వీఆర్ఏ సంఘం నేతలు ప్రకటించారు.
 

click me!