న్యాయ పోరాటం చేస్తాం: అసెంబ్లీ ,నుండి ఈటల సస్పెన్షన్ పై బండి సంజయ్

By narsimha lodeFirst Published Sep 13, 2022, 1:39 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు .అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 

హైదరాబాద్:  అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ సస్పెండ్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైద్రాబాద్ లో బీజేపీ తెలంగాణ చీప్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మర మనిషి అంటే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తారా అని ఆయన అడిగారు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందని ఆయన అడిగారు.  కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీని ఫాసిస్టు అనలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.అసెంబ్లీ నడిపే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలే సస్పెండ్ చేస్తారని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ నెల 6వ తేదీన జరిగిన అసెంబ్లీ బీఏసీ సమావేశానికి బీజేపీఎమ్మెల్యేలకు సమాచారం అందలేదు.ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ శాసనసభ వ్యవహరాల శాక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాలకు ఈటల రాజేందర్ హాజరు కాలేదు. ఇవాళ సభకు ఈటల రాజేందర్ హాజరయ్యారు.

also read:కేసీఆర్ ను మించిన ఫాసిస్టు లేరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణలు చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయమై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో పాటు స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని కోరారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమర్ధించారు. అయితే తాను స్పీకర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పాలని కోరినా స్పందించకపోవడంతో ఈటల రాజేందర్ ను సభ నుండి సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని మంత్రి  ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. 

 

click me!