వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో కేటీఆర్ భేటీ: వీఆర్ఏల డిమాండ్లపై చర్చ

By narsimha lodeFirst Published Sep 13, 2022, 1:58 PM IST
Highlights

వీఆర్ఏల సంఘం ప్రతినిధులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో చర్చిస్తున్నారు. 

హైదరాబాద్:వీఆర్ఏల సంఘం ప్రతినిధులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు అసెంబ్లీ కమిటీ హల్ లో భేటీ అయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చలో అసెంబ్లీకి  వీఆర్ఏల సంఘం పిలుపునిచ్చింది. చలో అసెంబ్లీ వచ్చిన వీఆర్ఏలను ఇందిరా పార్క్ వద్ద వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు.  ప్రభుత్వం నుండి తమకు స్పష్టమైన హమీ ఇ.స్తేనే తాము హైద్రాబాద్ ను వీడుతామని వీఆర్ఏలు తేల్చి చెప్పారు. దీంతో వీఆర్ఏ సంఘం ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. 

also read:చలో అసెంబ్లీకి వీఆర్ఏల పిలుపు: ఇందిరా పార్క్ వద్దే అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

అసెంబ్లీ కమిటీ హల్ కు వీఆర్ఏ సంఘం ప్రతినిధులు 10 మంది చేరుకున్నారు వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ చర్చలు ప్రారంభించారు. 2020 సెప్టెంబర్ 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తమకు వేతనాలు అందించాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న అసెంబ్లీలో కేసీఆర్ అసత్యాలు మాట్లాడారని వీఆర్ఏలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా ఇప్పటికే 30కి పైగా వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోయారని వీఆర్ఏ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.  గతంలో ప్రభుత్వం ప్రకటించిన వాటినే అమలు చేయాలని తాము కోరుతున్నామని వీఆర్ఏ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. 
 

click me!