దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతోంది. దీనిని కట్టడి చేసేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. వీరి సేవలను ప్రశంసిస్తూ ప్రధాని, ముఖ్యమంత్రులు, ప్రముఖులు సెల్యూట్ చేస్తున్నారు
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతోంది. దీనిని కట్టడి చేసేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. వీరి సేవలను ప్రశంసిస్తూ ప్రధాని, ముఖ్యమంత్రులు, ప్రముఖులు సెల్యూట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సంజీవయ్య పార్కు ఎదురుగా ఉన్న డి.ఆర్.ఎఫ్ శిక్షణా కేంద్రంలో బుధవారం శానిటేషన్, డిఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. లాక్ డౌన్ సమయంలో మీరందరూ వైద్యులు, పోలీస్ లకు ధీటుగా పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. .
undefined
కే టి.ఆర్ ప్రతి కార్మికుడిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొద్ది మందికి స్వయంగా వడ్డించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలు అందిస్తున్న శానిటేషన్, ఎంటమాలజి, డి.ఆర్.ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రోత్సహకాలను ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఇస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు.
ప్రజల కొరకు నిరంతరం పనిచేసేవారిని ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ చుట్టుప్రక్కల వారికి వివరించాలని మంత్రి కోరారు. వర్షాకాలం రాబోతున్నందున దోమల వ్యాప్తిని అరికట్టుటకై ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని ఎంటమాలజి విభాగానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, డిప్యూటి మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.